మాజీ నక్సలైట్ దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితులే హంతకులయ్యారు. శరీరం నుంచి తలను వేరుచేసి అతి కిరాతకంగా హత్య చేసి గోతిలో పూడ్చిపెట్టారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం, వద్దిపట్లకు చెందిన నామ శ్రీనివాస్(38), ఆదిబట్ల మున్సిపల్ సమీపంలోని బొంగ్లూర్ వద్ద మెట్రోసిటీ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీనివాస్ భార్య కవిత 16 ఏళ్ల క్రితమే మృతిచెందింది. ప్రస్తుతం ఆయన మరో మహిళతో సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ రెండు నెలలుగా కనిపించకకుండా పోయాడు. ఈ విషయాన్ని సదరు మహిళ తమ బంధువులకు సమాచారం ఇచ్చింది. డిసెంబర్ 14న శ్రీనివాస్ తండ్రి, కుటుంబ సభ్యులు ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.