కాంగ్రెస్ పార్టీలో 45 ఏళ్ల పాటు పనిచేసిన నేత కిశోర్ చంద్రదేవ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు కిషోర్ చంద్రదేవ్. తర్వాత 2014లో యాంటీ-కాంగ్రెస్ వేవ్ కారణంగా కేవలం 50 వేల ఓట్లు మాత్రమే దక్కించుకుని ఘోర పరాజయం పొందారు. ఆయనకున్న ఇమేజ్‌ని వాడుకునే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఎట్రాక్ట్ చేసింది. ఇప్పుడు టీడీపీ తరపున సైకిల్ గుర్తు మీద పోటీకి దిగారు కిషోర్ చంద్రదేవ్. తండ్రికి ఎదురు నిలబడి గెలిచి తీరతానంటూ శృతి దేవి కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర ఒత్తిడి తెచ్చిమరీ టిక్కెట్ తీసుకుంది. అరకులో తండ్రీ కూతుర్ల మధ్య జరగబోయే పోరు మీద జనంతో పాటు పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా ఆసక్తి నెలకొంది. కొన్నాళ్లుగా జనంలో తిరుగుతూ కిషోర్ చంద్రదేవ్ కూతురిగా ఆమె వారసురాలిగా బాగా ప్రచారం పొందిన శృతి ఇప్పుడా చరిష్మాను కాంగ్రెస్ కి ధారబోయనుంది. దీంతో తండ్రీ కుమార్తెల మధ్య పోరు తప్పని పరిస్థితి నెలకొంది. పర్యావరణ న్యాయవిద్య (ఎన్విరాన్‌మెంటల్ లా)ను అభ్యసించిన శ్రుతీదేవి.. గత మూడు ఎన్నికల్లో కిశోర్‌దేవ్ పక్షాన ప్రచార బాధ్యతలు నిర్వహించారు.