మీకు మరో విజయం.. అందుకు మరో సారి శుభాకాంక్షలు

F2 Movie Record Collections

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ ల మల్టిస్టారర్ చిత్రం ఎఫ్2. తమన్నా, మేహ్రీన్ లు కథానాయకలుగా నటించారు. ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దర్శకుడు అనిల్ ఈ చిత్రాని ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించాడు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సంక్రాతి భారీ సినిమాలు ఉన్నకానీ ఎలాగైనా విడుదల చేసి విజయాని దక్కించుకోవాలని చిత్రా నిర్మాత దిల్ రాజ్ భావించాడు. అనుకున్న విధంగానే చిత్రాని విడుదల చేసి విజయాని దక్కించుకున్నాడు. ఈ చిత్రం ఘన విజయం సాదించిన సందర్భంగా సినిమా పరిశ్రమకు చెందినా పలువురు ప్రముఖులు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

దర్శకుడు హరీష్ శంకర్ ఎఫ్2 చిత్రా నిర్మాత దిల్ రాజ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ… దిల్ రాజ్ ఖాతాలోకి మరో విజయం వచ్చి చేరిందంటు ట్విట్ చేశాడు. ఎఫ్2 చిత్రాని దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైనా నిర్మించాడు. ఈ చిత్రంలో ప్రధానంగా వెంకటేష్ చేసే కామెడీ సినిమాకు హైలట్ గా నిలిచిందంటున్నారు. వరుణ్ తేజ్ కూడా తెలంగాణా యాస లో మాట్లాడుతూ కామెడీ పండించాడని, మేహ్రిన్ కు వరుణ్ కు మద్య వచ్చే వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ సినిమాకు మంచి ప్లస్ పాయింట్స్ అంటున్నారు. ఆల్రెడీ అంతరిక్షం సినిమాతో నిరాశ పరిచిన వరుణ్ కు ఎఫ్2 సినిమా విజయం ద్వార వరుణ్ కు కొంత ఉరట లభించిందని చెప్పుకోవాలి. వెంకటేష్ కూడా బాబు బంగారం సినిమాతో నిరాశ పరిచిన ఎఫ్2 తో మంచి విజయాని దక్కించుకున్నాడు. అనిల్ రావిపూడి తన తరువాత సినిమాను నందమూరి బాలకృష్ణ తో తియ్యనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటించాలిసిన అవసరం ఉన్నది.