మహేష్ బాబు సరికొత్త రికార్డు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు, తమిళ ప్రేక్షకులో మంచి క్రేజీ ఉన్నది. ఆ క్రేజీ ని మహేష్ బాబు ఉపయోగించుకోవడంలో చాలా దిట్టని చెప్పుకోవాలి. సినిమా, వ్యాపారం ఈ రెండు రంగాలోను మహేష్ చక్కగా రానిస్తున్నాడు. వ్యాపార విషయానికి వచ్చినట్లయితే మాత్రం తాజాగా మల్టిఫ్లెక్స్ రంగంలోకి ప్రవేశించి తన పేరుమీద మహేష్ ఎయంబీ అనే మల్టి ఫ్లెక్స్ ను నిర్మించాడు. ఇకా సినిమా విషయానికి వస్తే ఇప్పటికే 24సినిమాలు పూర్తిచేసుకుని, 25వ సినిమాను వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజహేగ్దే కథానాయకగా నటిస్తుంది.

అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత షెడ్యూల్ ను పోలాచిలో జరపనున్నది. ఓ వైపు సినిమాలు చేస్తూ మరో వైపు ఆడ్స్ షూటింగ్లో పాల్గొంటున్నాడు. దాదాపుగా మహేష్ బాబు 15 బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నాడు. అందులో థమ్స్ అప్ , అభిబస్ ,చెన్నై సిల్క్స్ , క్లోజ్ అప్,గోల్డ్ విన్నర్ లు తదతరుల వాటికీ బ్రాండ్ ఎండార్స్ గా పని చేస్తున్నాడు. సౌత్ స్టార్ లోనే మహేష్ బాబు అత్యధిక బ్రాండ్స్ కు ఎండార్స్ గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. మహేష్ బాబు మరో వైపు సుకుమార్ దర్శకత్వంలో తన 26వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వన్ నేనొక్కడినే సినిమా వచ్చింది. ఇప్పుడు మహేష్ బాబు సుకుమార్ తో ఓ పిరియాడికల్ కథను సిద్దం చేశాడు. అందుకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.