పిరియడ్‌ బ్లడ్‌తో ఫేస్‌ ప్యాక్‌.. ఇప్పుడిదే ట్రెండ్‌ కానీ..

Face pack with period blood is a trend now.
Face pack with period blood is a trend now.

అమ్మాయిలు అందంగా ఉండాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. వాళ్ల దగ్గర ఉన్న ఆఖరి రూపాయి వరకూ ఖర్చుపెట్టడానికి వెనకాడని మహిళలు చాలా మంది ఉన్నారు. ఇలా చేస్తే మీ ముఖం మెరిసిపోతుంది రిజల్ట్‌ పక్కా అంటే.. కచ్చితంగా ట్రై చేస్తారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఒక వింత ఫేస్‌ ప్యాక్‌ ట్రెండింగ్‌ అవుతోంది. అదే పిరియడ్‌ బ్లడ్‌ ఫేస్‌ప్యాక్‌. ఛీ యాక్‌ అనుకుంటున్నారా..? కానీ దీనికి రిజల్ట్‌ వస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. పిరియడ్‌ బ్లడ్‌ను ఫేస్‌కు అప్లై చేయడం వల్ల మొఖం అందంగా, వృధ్యాప్య ఛాయలు రాకుండా ఉంటాయట. ముఖంపై మచ్చలు, మొటిమలు లేకుండా చేస్తుందట. ఇది ఎంత వరకూ నిజం, పిరియడ్ బ్లడ్‌ను ఫేస్‌కు అప్లై చేయొచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

యూరప్‌, అమెరికా, చైనాలో మహిళలకు పిరియడ్‌ బ్లడ్‌ ఫేస్‌ ప్యాక్‌ను పాటిస్తున్నారు. అక్కడ ఇది బాగా ట్రెండ్‌ అవుతోంది. పిరియడ్స్‌ వచ్చినప్పుడు మెన్స్‌ట్రువల్‌ కప్‌ వాడి ఆ రక్తాన్ని సేకరించి దాన్ని డైరెక్టుగా ఫేస్‌కు అప్లై చేస్తున్నారు. అయితే పిరియడ్‌ బ్లడ్‌ చర్మానికి మేలు చేస్తుంది అనడానికి ఎక్కడా శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇదంతా కేవలం పుకార్ల మీద నడస్తన్న ట్రెండ్‌ మాత్రమే. ఇది ఇన్‌ఫెక్షన్స్‌కు కారణం కావొచ్చని వైద్యులు అంటున్నారు. నిజానికి పిరియడ్‌ బ్లడ్‌ డెడ్‌ స్కిన్‌ సెల్స్ మరియ ఎండోమైసియంతో తయారు అవుతుంది. ఇది చర్మానికి చాలా హానికరమట. పిరియడ్‌ బ్లడ్‌లో ఉండే బాక్టిరియా, ఫంగల్‌ చర్మంపై మొటిమల సమస్యను పెంచుతుందని కొందరు అంటున్నారు.

ముఖ్యంగా బ్యూటీ ఇండస్ట్రీలో ఏదైనా కొత్తదనం వచ్చినప్పుడు దాన్ని ప్రయత్నించాలని చాలా మంది కోరుకుంటారు. అయితే అందం పోకడలను గుడ్డిగా అనుసరించడం ఎల్లప్పుడూ తెలివైన పని కాదు ఎందుకంటే అవి ప్రమాదకరమైనవి. పీరియడ్ బ్లడ్‌ను ఫేస్ మాస్క్‌గా ఉపయోగించడం సురక్షితం కాదు. వాస్తవానికి, ఇది చర్మ వ్యాధులకు దారితీయవచ్చని, ప్రత్యేకించి మీకు ఇప్పటికే యోని లేదా గర్భాశయ సంక్రమణం ఉన్నట్లయితే ఇది ప్రమాదకరమైనదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాంపైర్‌ ఫేషియల్‌, పిరియడ్‌ బ్లడ్‌ ఫేస్‌ ప్యాక్‌ రెండూ ఒకటేనా..?

వాంపైర్‌ ఫేషియల్‌లో అంటే మానవ రక్తాన్ని ఉపయోగించే బ్యూటీ ట్రీట్‌మెంట్‌. ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా (పిఆర్‌పి) అంటారు. ఇందులో రక్తాన్ని సిర నుండి తీసిన తర్వాత అది “మీ చర్మానికి ఇంజక్షన్‌ రూపంలో ఇస్తారు. ఇది యాంటీ ఏజింగ్ మరియు యాంటీ పిగ్మెంటేషన్ ట్రీట్‌మెంట్ల కోసం ఉపయోగపడుతుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ ప్రకారం, PRP ముడుతలను తగ్గిస్తుంది, కుంగిపోయిన చర్మాన్ని బొద్దుగా చేస్తుంది, లోతైన మడతలను తగ్గస్తుంది. మీ ఛాయను మెరుగుపరుస్తుంది మరియు మొటిమల మచ్చలను కూడా తగ్గిస్తుందని చెప్తుంది.

అయితే ఈ రెండు బ్లడ్‌తో చేస్తారు కాబట్టి రెండూ ఒకటే అని అనుకోకండి. పిరియడ్‌ బ్లడ్‌ను చర్మంపై పూస్తారు. ఇది ఇంజెక్షన్ థెరపీకి సమానం కాదు. ఇలాంటి ప్రయోగాలు చేసి ఉన్న అందాన్ని కూడా పాడు చేసుకున్నవాళ్లు అవుతారని నిపుణులు అంటున్నారు. దీనికి బదులుగా వేరే చికిత్సలు చేయించుకోవడం, మంచి ఆహారం తింటూ వ్యాయామం చేస్తూ హైడ్రేట్‌డ్‌గా ఉంటే చాలు.