సోషల్‌మీడియా ద్వారా ఎంత వెసులు బాటు ఉందో అంతకంటే ప్రమాదం దాగి ఉందని కొన్ని ఘటనలు మనకు వ్యక్తపరుస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోయాయి. అనేక మంది ఫేస్‌బుక్‌లో పరిచయమైన వారు మోజులో పడి తమ సంసారాలను నాశనం చేసుకుంటున్నారు.
తాజాగా తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఓ వివాహిత భర్తను వదిలేసి ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో లేచి పోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి వారికోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
అయితే అసలేం జరిగింది అంటే.. తాండూరు మండలం కోత్లాపూర్‌కు చెందిన విక్రమ్‌గౌడ్, అదే గ్రామానికి చెందిన అనితకు తొమ్మిదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇంకా సంతానం లేదు. దీంతో అనితకు కొంతకాలం క్రితం ఫేస్‌బుక్‌లో అలీ ఇమ్రాన్ షేక్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. రోజూ అతడితో గంటల కొద్దీ ఛాటింగ్ చేస్తూ.. ఫోన్లో మాట్లాడేది. గత నెల 26న అనిత కనిపించకుండా పోవడంతో విక్రమ్‌గౌడ్ ఆందోళన చెందాడు. బంధువులు, తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ఎక్కడా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో తన భార్య ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తోనే వెళ్లిపోయి ఉండొచ్చని వక్రమ్ అనుమానించాడు. వివరాలు తెలుసుకొనేందు ఫేస్‌బుక్‌లో అతడి ప్రొఫైల్‌ను చెక్ చేయగా అకౌంట్ క్లోజ్ చేసి ఉంది. దీంతో అతడికి అనుమానం మరింత బలపడింది. కాగా తాజాగా తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలీ ఇమ్రాన్‌షేక్ అనే వ్యక్తి తన భార్యను ఫేస్‌బుక్ ద్వారా ట్రాప్ చేసి తీసుకెళ్లి పోయాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.