“ఫేస్‌బుక్‌ పే” వచ్చేసింది

"ఫేస్‌బుక్‌ పే" వచ్చేసింది

ఫేస్‌బుక్‌లో ఫేస్‌బుక్‌ పే డిజిటల్ పేమెంట్ సెగ్మెంట్‌ పేరుతో  అమెరికాలో లాంచ్‌ చేసింది. ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ఫేస్‌బుక్‌ సొంతమైన వాట్సాప్‌, మెసెంజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా డిజిటల్‌ లావాదేవీల కొరకి త్వరలోనే అందుబాటులోకి తీస్కురానుంది.

ఫేస్‌బుక్‌లోని మార్కెట్ ప్లేస్ అండ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ డెబోరా లియు ఒక ప్రకటనలో ఎక్కువ మందికి ఫేస్‌బుక్‌  పే డిజిటల్ పేమెంట్ సెగ్మెంట్‌ వచ్చేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. దాదాపు అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు పేపాల్‌ ద్వారా  ఫేస్‌బుక్ పే చెల్లింపులను చేయవచ్చు. ఈవెంట్ టిక్కెట్లు ఇంకా వ్యక్తుల మధ్య నగదు లావాదేవీలు చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్‌ యాప్‌ ద్వారా చెల్లింపు చేయవచ్చు. అలాగే వెబ్‌సైట్‌లోని సెట్టింగ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి ఆపై ‘ఫేస్‌బుక్ పే’కు వెళ్లి లావాదేవీ పూర్తి చేయవచ్చు. డబ్బు పంపేటప్పుడు లేదా చెల్లింపు చేసేటప్పుడు వినియోగదారులు భద్రత కోసం పిన్ నెంబర్, టచ్ లేదా ఫేస్ ఐడి గుర్తింపు లాంటి  బయోమెట్రిక్‌ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు.