ఇంత దారుణమా??.. కర్ఫ్యూ పాసులు అమ్ముతూ దొరికిపోయాడు ఇలా…

కరోనా ప్రపంచంలో విలయతాండవం చేస్తుంది. దీంతో దేశమంతా లాక్‌డౌన్ లో కొనసాగుతుంది. దీంతో అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు మాత్రమే పోలీసులు అనుమతులు ఇస్తున్నారు. ఇదే అదనుగా ఓ ఖాకీ కక్కుర్తికి పాల్పడ్డాడు. ఎమర్జెన్సీ పాసులని అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి అడ్డంగా బుక్కయ్యాడు.

లాక్‌డౌన్ తో అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు మాత్రమే పోలీసులు అనుమతులు ఇస్తున్నారు. దీంత ఓ ఖాకీ కక్కుర్తికి పాల్పడి అక్రమంగా పాసులని అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి అడ్డంగా బుక్కైన విషయం వెలుగు చూసింది.

అయితే బెంగుళూరులో లాక్‌డౌన్ కారణంగా ప్రజలెవరూ రోడ్లపైకి రావడం లేదు. అలా రాకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధాజ్ఞలు విధించింది. కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతులు ఇస్తున్నారు. ఇదే అదనుగా భావించిన బెంగళూరుకి చెందిన బిజినెస్ మ్యాన్ పోక్రాజ్ జవాన్ అనే వ్యక్తి ఓ హెడ్ కానిస్టేబుల్‌తో ఒప్పందం కుదుర్చుకుని రెండు వాహనాలకు అత్యవసర సేవల కింద కర్ఫ్యూ పాసులు సంపాదించాడు.

ఆ పాసులను ఉపమోగించి రెండు టెంపో వాహనాల్లో సుమారు 24 మందిని బెంగళూరు నుంచి రాజస్థాన్ తీసుకెళ్లేందుకు రెడీ అయ్యాడు. అయితే రెండు వాహనాలకు అనధికారికంగా అనుమతులు మంజూరు చేసిన వ్యవహారం బయటికి పొక్కడంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. వెంటనే శాఖాపరమైన విచారణకు ఆదేశించడంతో హెడ్ కానిస్టేబుల్ వీరభద్రప్ప అక్రమంగా పాసులు ఇచ్చినట్లు తేలడంతో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరణ ఇవ్వాలంటూ స్టేషన్ ఎస్సైకి మెమో జారీ చేశారు. మొత్తానికి ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఇలాంటి కక్కుర్తి పను చోటుచేసుకోవడం విశేషం.