ఒక్క సౌదీ కుటుంబం. 150 మందికి కరోనా.

విశ్వాన్నే వణికించేస్తున్న వైరస్ కరోనా. ఈ మహమ్మారి చైనాలో పుట్టిన ఈ వైరస్ అక్కడ తగ్గినట్లే తగ్గి తిరిగి విజృంభిస్తోంది. ఇతర ప్రపంచ దేశాలపై తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. తీవ్రమైన పంజా విసురుతోందనే చెప్పాలి. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యాలు కూడా కుప్ప కూలుతున్నాయి.

అయితే తాజాగా సౌదీ రాజకుటుంబంలో 150మందికి కరోన పాజిటివ్ వచ్చినట్టు సమాచారం అదుతుంది. వీరిలో కొంతమంది తీవ్రంగా జబ్బు పడగా మరి కొందరి పరిస్థితి సాధారణంగానే ఉంది. రియాద్ గవర్నర్ సీనియర్ యువరాజు ఐసీయూలో ఉన్నారని తెలుస్తోంది. అలాగే.. రాజు సల్మాన్ కూడా ఐసోలేషన్ లో ఉన్నట్టు సమాచారం.

సౌదీ రాజకుటుంబానికి వైద్య చికిత్స అందించే కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ ఆసుపత్రి అధికారులు 500 పడకలు ఏర్పాటుచేయాల్సిందిగా ప్రభుత్వ అంతర్గత అధికారులు సందేశం పంపారు. దీంతో ఈ విషయం బయటికి వచ్చినట్లు సమాచారం. కాగా సౌదీలో ఇప్పటివరకు మొత్తం 2932 మంది కరోనా బారిన పడగా.. 631 మంది వైరస్ నుండి కోలుకున్నట్లు గణాంకాల ప్రకారం తెలుస్తోంది.