గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో.. ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ రమేష్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కోల్‌కతాకు చెందిన ఆర్మీ రిటైర్డ్ అధికారి సుకుమార్ జితేందర్‌నాథ్ మండల్ పెద్ద కూతురు శతాబ్ధి మండల్ కొంత కాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసి ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తోంది. 2020 ఆగస్టులో గచ్చిబౌలిలో నివాసం ఉంటోంది. షేరింగ్ ఫ్లాట్‌లో ఉండే డాక్టర్ ప్రియాంక రెడ్డి, గీత మాధురిలు నవంబర్ 28న బయటకు వెళ్లారు. తిరిగి 30న మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. ఫ్లాట్‌లోకి రాగానే దుర్వాసన రావడంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు.
మాస్టర్ కీతో తలుపులు తెరిచి చూడగా చున్నీతో ఫ్యాన్‌కు చున్నీ తో ఉరి వేసుకొని ఉంది. మృతదేహం కుళ్లి పోయిన స్థితిలో ఉండగా పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తండ్రి సుకుమార్ చిన్న కూతురుతో కలిసి గుజరాత్లో ఉంటున్నారు. పెద్ద కుమార్తె మరణ వార్త విని హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చారు. మృతదేహన్ని తండ్రికి అప్పగించారు. షేరింగ్ ఫ్లాట్‌లో ఉండేవారు బయటకు వెళ్లిన రోజే శతాబ్ధి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని, కారణాలు వెల్లడి కాలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.