తిండి లేక తండ్రి మృతి

తిండి లేక తండ్రి మృతి

కేరళలోని ముండాయక్కమ్‌కు చెందిన పొడియాన్‌(80), యామిని(76) వృద్ధ దంపతులు తన కొడుకు రేజీతో కలిసి నివసిస్తున్నారు. తాగుడుకు బానిసైన రేజీ నిత్యం తల్లిదండ్రులతో గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో అతడు తన తల్లిదండ్రులను గదిలో బంధించి తిండి పెట్టకుండా హింసించాడు. ఇరుగు పొరుగు కూడా వారికి ఆహారం అందించకుండా ఉండేందుకు ఆ గదిలో కుక్కను కట్టేశాడు. దీంతో ముసలి జంటను దుస్థితి తెలిసి వారికి సాయం చేద్దామన్నా కుక్క ఉండటంతో ఎవరూ వారి దగ్గరకు కూడా వెళ్లలేకపోయారు.

పిడికెడు మెతుకులు కూడా కడుపులో పడకపోవడంతో డొక్క లోపలకు పోయి తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు. వాళ్ల దయనీయ పరిస్థితిని చూసి కొందరు ఆశా కారక్యర్తలకు సమాచారం అందించారు. మంగళవారం నాడు వారు పోలీసులను వెంట పెట్టుకుని రాగా దంపతులను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పొడియాన్‌ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ప్రాణాలు విడిచాడు. పోస్టుమార్టం నివేదికలోనూ అతడికి తిండి లేక అంతర్గత అవయవాలు దెబ్బతిని మరణించాడని తేలింది. మరోవైపు అతడి భార్య ఇంకా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రేజిని అరెస్టు చేశారు.