కూతురు తలపై బాదిన తండ్రి.. ఆపై హత్య

తమిళనాడులోని మధురై సమీపంలో ఘోరం చోటుచేసుకుంది. అక్కడ తూటికోరిన్‌కు చెందిన తండ్రి తన 20 ఏళ్ల కుమార్తెను హత్య చేశాడు. మృతుడి నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు  ఆంథోనిసితగా గుర్తించారు. ఆంథోనిసిత తన తండ్రితో వాగ్వాదానికి దిగడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి మధ్య తీవ్ర వాద్వాదం జరిగిందని తెలుస్తోంది. ఇద్దరి మధ్య వాదనతో ఆవేశాన్ని ఆపుకోలేని తండ్రి ఏకంగా  తన కుమార్తెను తలపై ఒక మొద్దుతో కొట్టినట్లు తెలుస్తోంది.
అయితే తండ్రి దాడికి కూతురు తలపై బలమైన గాయమై కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. వెంటనే అతూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమంగా మారి మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా పోలీసులు మొదట ఈ కేసును హత్యాయత్నం కేసుగా నమోదు చేసి ఆ తర్వాత ఈ కేసును హత్య కేసుగా మార్చారు. అతడి మనసిక పరిస్థితి బాగోలేదని దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనికి మత్తుమందులు ఇచ్చి విశ్రాంతిని ఇచ్చినట్లు సమాచారం అందుతుంది.