కన్నకూతురుని గర్భవతిని చేసిన తండ్రి

20-year-old- girl gang-rape-in-chittoor

హైదరాబాద్ లో ఘోరం వెలుగు చూసింది. కన్నకూతురునే గర్భవతిని చేసిన తండ్రి దాష్టికం కలకలం రేపుతోంది. దుండిగల్ పోలీస్ స్తేషన్ పరిధిలోని న్యూ శివాలయ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. కామంతో కళ్ళు మూసుకు పోయిన ఒక తండ్రి కన్న కూతురినే గర్బవతిని చేశాడు. ఏమాత్రం కన్నకూతురు అన్న బంధం కూడా తెలియకుండా కామంతో కళ్లుమూసుకొని పోయిన ఆ తండ్రి కన్నకూతురును గర్భవతిని చేశాడు.

అసలు ఏం జరిగింది అంటే… న్యూ శివాలయ నగర్ లో కుటుంబంతో కలిసి కాపురం ఉంటున్నాడు రాజు. అతనికి పద్నాలుగేళ్ల వయస్సు గల తేజస్విని అనే కుమార్తె ఉంది. తాజాగా ఆమె గర్భం దాల్చింది. దీంతో తండ్రి అయిన రాజుపై స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. తండ్రే కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేశాడని స్థానికులు‌ ఆరోపిస్తున్నారు. అది తెలిసి తండ్రిని అంతాకలిసి చితకబాదారు. ఆ తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 6నెలల గర్భవతి అయిన భాధితురాలిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.