రచ్చ చేయడంలోనూ, జనాన్ని రెచ్చగొట్టడంలోనూ వర్మకి ఉన్నంత అనుభవం మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరికీ తెలీదేమో ? సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో, అదీ ఉన్న చోట నుండి కదలకుండా ఆయన దగ్గర నేర్చుకోవచ్చ్హు. తాజాగా ఆయన అలాంటి స్టైల్ లోనే తన కొత్త సినిమా మొదలు పెట్టకుండా ఆ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. వైఎస్ జగన్ ఏపీ సీఎంగా గెలిచిన తర్వాత ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా ప్రకటించిన వర్మ, ఆ తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం. జగన్ తో కలిసి దర్శనానికి తిరుమల వెళ్లి ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా కోసం ఆశీర్వాదం తీసుకున్నానని చెప్పడం. చేస్తున్న వర్మ నిన్న జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరవడానికి విజయవాడ నొవాటెల్ హోటల్లో దిగిన రాయలసీమ వైసీపీ నాయకులు, కార్యకర్తల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ‘విజయవాడ నొవాటెల్ హోటల్ మొత్తం కడప రెడ్ల మయం’ అనే టైటిల్‌తో పోస్ట్ చేస్తూ, ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ యాష్ ట్యాగ్ యాడ్ చేసాడు. నిజానికి విజయవాడలోని నొవాటెల్ హోటల్, టీడీపీ ఎంపీ కేశినేని నాని అండర్ లో ఉందని అనుకుంటూ ఉంటారు, అందుకే వర్మ ఆలా పోస్ట్ చేశాడు, ఇక ఈరోజు కొత్తగా ఎండలకి కాదు, రెడ్లకి భయపడి కమ్మోళ్ళు బయటకి రావట్లేదంట #KammaRajyamLoKadapaRedlu అంటూ ట్వీట్ చేసి రచ్చ రేపాడు. నిజానికి గతంలో ఏ డైరెక్టర్ ఇలా కులాల ప్రస్తావన తెచ్చిన దాఖలాలు అయితే లేవు, మరి వర్మ ఎందుకు ఇలాంటి పోస్ట్ లు చేస్తూ రచ్చ రేపుతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.