డ‌బ్బుల కోసం ఫీట్లు.. ఆట‌ప‌ట్టించిన ట్వింకిల్ ఖ‌న్నా

feets for money

ఖిలాడీ కింగ్ అక్ష‌య్ కుమార్ ఐదు ప‌దుల వ‌య‌స్సులోను ఎంతో ఫిట్‌గా ఉంటార‌నే సంగ‌తి తెలిసిందే. అత‌ని ఫిట్‌నెస్‌తో పాటు చేసే మార్ష‌ల్ ఆర్ట్స్‌ని చూసి ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటారు. ఆ మ‌ధ్య సూర్య వంశీ చిత్రం కోసం బైకుపై స్టంట్ చేస్తూ..పైన వెళ్తున్న హెలికాప్టర్‌పై ఎక్కి తలకిందులుగా వేలాడుతూ ఫీట్ చేశాడు. ఇది ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్ర‌స్తుతం అక్ష‌య్ కుమార్ తాను న‌టిస్తున్న మిష‌న్ మంగ‌ళ్‌, సూర్య వంశీ, ల‌క్ష్మీ బాంబ్ చిత్రాల‌కి కాస్త బ్రేక్ ఇచ్చి స‌తీమ‌ణితో క‌లిసి విహార యాత్ర‌ల‌క‌ని లండ‌న్ వెళ్లాడు.

విహార‌యాత్ర‌లో భాగంగా అక్ష‌య్ దంప‌తులు లండ‌న్‌లోని పలు ప్ర‌దేశాలు సంద‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ ప్ర‌దేశానికి వెళ్ల‌గా అక్క‌డ .. ఎక్కువ సేపు వేలాడండి..100 పౌండ్లు గెలుచుకోండి అని ఓ ప్రకటన పెట్టారు. దానిని చూసిన‌ అక్ష‌య్.. ఆ గేమ్‌లో పాల్గొన్నాడు. రాడ్‌ని ప‌ట్టుకొని కొద్ది సేపు వేలాడాడు. ఈ దృశ్యాన్ని ట్వింకిల్ ఖ‌న్నా త‌న ఫోన్‌లో చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి కామెంట్‌గా.. వేలాడుతున్న అక్ష‌య్ !! ‘ఫోర్బ్స్‌ జాబితాలో చేరింది సరిపోద‌న్న‌ట్టు, 100 పౌండ్ల(రూ.8539) కోసం ఇలా వేలాడుతున్నారు’ అని క్యాప్షన్ రాసి ఆట‌ప‌ట్టించింది. ప్ర‌స్తుతం ఈ వీడియోని ఇప్ప‌టి వ‌ర‌కు 9,67,035 వీక్షించారు.

2019 సంవ‌త్స‌రానికి గాను ఫోర్బ్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత పారితోషికం తీసుకుంటున్న 100 మంది ప్రముఖుల లిస్ట్‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ఇందులో భారత్ నుంచి బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌కు మాత్రమే చోటు దక్కింది. రూ.444 కోట్ల ఆదాయంతో 33వ స్థానం పొందారు. 2018 జాబితాలోనూ అక్షయ్‌కుమార్ 76వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అమెరికా గాయకుడు టేలర్ స్విఫ్ట్ ఈ ఏడాది జాబితాలో తొలి స్థానం పొందారు. గత 12 నెలల్లో రూ.1,266 కోట్లను (185 మిలియన్ డాలర్లు) సంపాదించారు. ఇక రెండు, మూడు స్థానాల్లో క్లైజీనర్, కన్ని వెస్ట్ నిలిచారు. టాప్-10లో సాకర్ క్రీడాకారులు మెస్సీ, రోనాల్డో, నెయ్‌మర్ ఉన్నారు.