Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ‘ఫిదా’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల ఈ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లాస్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మాస్ ఆడియన్స్‌కు కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. సినిమా విడుదలకు 15 రోజుల ముందు కొన్ని కీలక సన్నివేశాలను దిల్‌రాజు పట్టుబట్టి మరీ హడావుడిగా రీ షూట్ చేయించాడు. దర్శకుడు శేఖర్ కమ్ముల అయిష్టంతోనే నిర్మాత కోరిక మేరకు ఆ సీన్స్‌ను రీ షూట్ చేయడం జరిగింది. ఈ రీ షూట్ వల్ల సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.
సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ సాగతీసినట్లుగా ఉన్నాయి అనే విమర్శ ఇప్పుడు వస్తుంది. అయితే రీ షూట్ చేయకుంటే సెకండ్ హాఫ్ మొత్తం దొబ్బేది అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. దాదాపు 10 నిమిషాలు రీ షూట్ సీన్స్‌ను సినిమాలో యాడ్ చేయడం జరిగింది. ఆ సీన్స్ వల్ల ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అందుకే దిల్‌రాజు జడ్జిమెంట్‌కు ఇండస్ట్రీలో ఇంత క్రేజ్. దిల్‌రాజు ఒకసారి ఓకే చెప్పాడు అంటే అది ప్రేక్షకులకు నచ్చి తీరుతుంది. ఎంతటి దర్శకుడు అయిన దిల్‌రాజు సలహాలు, పైనల్ జడ్జ్మెంట్ తీసుకోవాల్సిందే. అందుకే దిల్‌రాజుకు వరుసగా సక్సెస్‌లు దక్కుతున్నాయి. కోట్లలో లాభాలు వస్తున్నాయి.
మరిన్ని వార్తలు