క్యాస్ట్రో కుమారుడు ఆత్మ‌హ‌త్య‌

Fidel Castro 's Eldest Son Fidel Castro Diaz Balart Commits Suicide
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

క్యూబా దివంగ‌త అధ్య‌క్షుడు, క‌మ్యూనిస్టు నేత ఫిడేలో క్యాస్ట్రో పెద్ద కొడుకు ఫిడెల్ ఏంజెల్ క్యాస్ట్రో డియాజ్ బ‌లార్ట్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. 68 ఏళ్ల డియాజ్ కొంత‌కాలంగా డిప్రెష‌న్ లో కూరుకుపోయారు. డియాజ్ క్యాస్ట్రో మొద‌టి భార్య మిర్టా డియాజ్ బ‌లార్డ్ కుమారుడు. చూడ్డానికి అచ్చు తండ్రి క‌నిపించే డియాజ్ ను క్యూబ‌న్లు ముద్దుగా ఫిడెలిటో అని పిలుచుకుంటారు. 1949 సెప్టెంబ‌ర్ 1న డియాజ్ జ‌న్మించారు. క్యూబాకు స‌న్నిహితంగా ఉండే సోవియ‌ట్ యూనియ‌న్ లో శాస్త్ర‌వేత్త‌గా ప‌నిచేశారు. న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ ప్రోగ్రామ్ ను అభివృద్ధి చేయ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుతం క్యూబా ప్ర‌భుత్వానికి శాస్త్ర స‌ల‌హాదారుగా, క్యూబా అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ కు ఉపాధ్య‌క్షుడిగా ప‌నిచేస్తున్నారు. డిప్రెష‌న్ తో బాధ‌ప‌డుతున్న డియాజ్ కు కొన్ని నెల‌ల నుంచి కొంత‌మంది వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. కొన్నిరోజులు ఆస్ప‌త్రిలో ఉన్న డియాజ్ త‌ర్వాత ఔట్ పేషెంట్ గా చికిత్స పొందుతున్నారు. కానీ ఈ చికిత్సలేవీ ఫ‌లితాన్నివ్వ‌లేదు. డియాజ్ హ‌వానాలో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పడ్డార‌ని క్యూబా అధికారిక మీడియా గ్రాన్మా తెలిపింది.