భరత్‌ అనే నేను ఒక సంచలనం..

Film unit members about bharath anu nenu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక హోదా విషయం చాలా సీరియస్‌గా ఉన్న విషయం తెల్సిందే. అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొంటున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు పోటా పోటీగా ఉద్యమంను ముందుకు నడిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మహేష్‌బాబు నటించిన రాజకీయ నేపథ్య చిత్రం ‘భరత్‌ అనే నేను’ విడుదలకు సిద్దం అయ్యింది. మహేష్‌బాబు ఈ చిత్రంలో సీఎంగా కనిపించబోతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఏపీ మరియు తెలంగాణలో ఈ చిత్రం సంచలన వసూళ్లు సాధిస్తాయనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రం ‘శ్రీమంతుడు’ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఆ చిత్రం సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిన ఆ చిత్రంను మించేలా ‘భరత్‌ అనే నేను’ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యు మొదటి నుండి చెబుతూ వచ్చారు. ‘అతడు’ చిత్రంలో మహేష్‌బాబు కొద్ది సమయం ఎమ్మెల్యేగా కనిపిస్తేనే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా, పూర్తి సినిమా అంతా కనిపించబోతున్నాడు. అందువల్ల ఈ చిత్రం ఒక సంచలనంగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మహేష్‌బాబు సంచలనాలకు మారు పేరుగా నిలిచి, రికార్డు బ్రేకింగ్‌ చిత్రాన్ని ప్రేక్షకులకు అప్పగిస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఈనెల 20న భరత్‌ అనే నేను ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.