వర్మ దృష్టిలో పవన్‌, శ్రీరెడ్డి..!

Ram gopal varma comments on pawan and srireddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రతి విషయంలో తనదైన శైలిలో తలదూర్చే వర్మ తాజాగా శ్రీరెడ్డి విషయంలో కూడా వింత కామెంట్స్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏ వ్యాఖ్యలు చేసినా కూడా చివరకు పవన్‌ కళ్యాణ్‌ వైపుకు మరలడం వర్మ స్టైల్‌. తాజాగా శ్రీరెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలతో కూడా పవన్‌పై కౌంటర్‌ వేశాడు. తాజాగా వర్మ శ్రీరెడ్డి విషయంలో స్పందిస్తూ.. ప్రస్తుతం శ్రీరెడ్డికి ముంబయిలో మంచి క్రేజ్‌ ఏర్పడటం జరిగింది. శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియా ద్వారా చేస్తున్న వ్యాఖ్యల వల్ల జాతీయ స్థాయి మీడియాలో కూడా పబ్లిసిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ కంటే కూడా ఎక్కువగా శ్రీరెడ్డిని గుర్తు పట్టే వారు ముంబయిలో ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు.

శ్రీరెడ్డి వ్యవహారంపై వర్మ స్పందించిన తీరు చాలా విభిన్నంగా ఉండటంతో అంతా కూడా నోరెళ్లబెడుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ గురించి ముంబయిలో పెద్దగా తెలియదు. ఆయన కంటే కూడా ప్రస్తుతం శ్రీరెడ్డికి అక్కడ గుర్తింపు ఉందని వర్మ చేసిన వ్యాఖ్యలతో పలువురు ఏకీభవిస్తున్నారు. ఒక వైపు నాగార్జునతో ఆఫీసర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు వర్మ త్వరలోన ఒక హిందీ సినిమాను చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. ఇక వర్మ ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర చిత్రాన్ని పూర్తిగా వదిలేసినట్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సినిమాలు ప్రకటించడం, వదిలేయడంతో పాటు ఇలా తనకు సంబంధం లేని విషయాలపై స్పందిస్తూ వార్తల్లో వ్యక్తిగా వర్మ ఎప్పుడు ఉంటూనే ఉన్నాడు.