హైదరాబాద్ కూకట్పల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మర్డర్ మిస్టరీ దాదాపు తేల్చేసారు పోలీసులు..ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం అని గుర్తించిన పోలీసులు…హత్యతో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా అన్న కోణంలో విచారిస్తున్నారు. కూకట్పల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ మర్డర్ కేసు మిస్టరీని దాదాపు తేల్చిన పోలీసులు…హేమంతే నిందితుడు అని నిర్దారణకు వచ్చారు. తన హత్య జరగటానికి కొద్ది గంటల ముందే ప్రియాంకను సతీష్ హాస్టల్ వద్ద దింపడం…అక్కడి నుండి నేరుగా హేమంత్ రూమ్‌కు వెళ్లి పార్టీ చేసుకుంటూ ప్రాణాలు కోల్పోవడంతో…పోలీసుల సస్పెక్ట్ అంతా ప్రియాంక వైపే మల్లింది . తమదైన శైలిలో విచారించినా…తనకు ఈ హత్యతో ఎలాంటి సంబందం లేదని ప్రియాంక మొదటి నుంచీ చెప్పుకొచ్చింది. కానీ…నిందితుడు హేమంత్..హత్యకు గురైన సతీష్ ఇద్దరూ మంచి స్నేహితులు…
ఈ ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ ప్రియాంక కావడంతో…పోలీసుల అనుమానం మరింత బలపడింది. ఇద్దరితో ఇంతకాలం ప్రియాంక స్నేహం చేసినా…..హత్యలో మాత్రం ఆమె ప్రమేయం లేదని దాదాపు నిర్దారించారు పోలీసులు. నాకు ఇద్దరూ పరిచయమే కానీ..హత్యతో సంబందం లేదన్న ప్రియాంక వర్షనే కరెక్ట్ అని గుర్తించారు పోలీసులు. పోలీసుల అదుపులో ఉన్న హేమంత్ కూడా…ఆర్థిక లావాదేవీలతోనే సతీష్‌ను హత్య చేసాననీ అతనిపై ఉన్న కోపానికి ముక్కలు ముక్కలుగా నరకాలని భావించినా సతీష్ ప్రాణాలు పోగానే భయమేసి పారిపోయానని పోలీసుల ముందు చెప్పాడు . తాను సతీష్ ను హత్య చేస్తానని ప్రియాంక అస్సలు ఊహించి ఊండదని కూడా విచారణలో ఒప్పుకున్నాడు. సతీష్ తన వద్దకు వస్తున్నాడని తెలిసినా ఇద్దరం కలిసి పార్టీ చేసుకుంటారని అనుకోవచ్చు తప్ప…సతీష్‌ను హత్య చేస్తానని ఏ మాత్రం ప్రియాంకకు తెలియదన్నాడు హేమంత్. మృతుడు సతీష్ బార్య ప్రశాంతి మాత్రం హేమంత్‌ను చేరదీస్తే..పాముకు పాలు పోసి పెంచినట్టైందని ఆరోపించడంతో పాటు…హేమంత్ ఒక్కడే ఈ హత్య చేసాడంటే నమ్మనంటోంది, హేమంత్ వెనుకాల ఉన్న వారిని బైటపెట్టడంతో పాటు ప్రియాంక , హేమంత్ , క్రాంతి ల సెల్‌ఫోన్ డాటాను చూడాలంటూ పోలీసులను కోరుత