మెటా కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌పై ఉత్తర ప్రదేశ్‌లో కేసు నమోదు అయ్యింది. సమాజ్‌వాదీ పార్టీ ఛీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు వ్యతిరేకంగా చేసిన ఓ పోస్ట్ వివాదాస్పదం కావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.కన్నౌజ్ జిల్లాలోని ఓ న్యాయస్థానంలో పరువుకు భంగం కలిగించే ప్రయత్నం కింద కేసు నమోదు అయ్యింది.
జుకర్‌బర్గ్‌తో పాటు 49 మంది పేర్లను ఇందులో చేర్చినట్లు తెలుస్తోంది. జుకర్‌బర్గ్‌కు ఆ పోస్ట్‌కి ఎలాంటి సంబంధం లేకున్నా.. ఆయన సీఈవోగా ఉన్న ఫ్లాట్‌ఫామ్‌లో ఆ పోస్ట్ పడడం, అందులో అఖిలేష్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకరంగా కామెంట్లు పడడంతోనే ఎఫ్ఐఆర్లో జుకర్‌బర్గ్ పేరు చేర్చినట్లు తెలుస్తోంది.పీటీఐ రిపోర్ట్ ప్రకారం.. కన్నౌజ్ జిల్లా సారాహతి గ్రామానికి చెందిన అమిత్ కుమార్ అనే వ్యక్తి ఈ కేసును దాఖలు చేశాడు.
అఖిలేష్ ఇమేజ్ను దెబ్బ తీసేందుకే అలాంటి పోస్ట్‌ను చేశారని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ అమిత్ కోర్టులో దాఖలు చేసిన అభ్యర్థన పిటిషన్లో పేర్కొన్నాడు. అంతకు ముందు పోలీసులకు ఈ వ్యవహారంపై పిటిషన్ అందజేసినా స్పందన లేదని కుమార్ కోర్టుకు వెల్లడించాడు. ‘బువా బాబువా’ పేరుతో రన్ అవుతున్న ఓ పేస్బుక్ పేజీలో అఖిలేష్ యాదవ్‌తో పాటు బీఎస్పీ ఛీఫ్ మాయావతిని ఉద్దేశిస్తూ సెటైరిక్ పోస్టులు పడుతుంటాయి.
అయితే ఈ పిటిషన్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన పోలీసులు ఈ కేసు నుంచి జుకర్‌బర్గ్ పేరును తప్పించారు. పేజీ అడ్మిన్‌ని ప్రశ్నించి దర్యాప్తను వేగవంతం చేస్తామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇక ఈ పిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.