భారీ అగ్నిప్రమాదం

భారీ అగ్నిప్రమాదం

ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరేల్‌ ప్రాంతంలోని బహుళ అంతస్థుల నివాస భవనంలో శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు.. కర్రీ రోడ్డులోని అవిఘ్న పార్క్ భవనంలో మంటలు చెలరేగాయి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంరతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

విషయం తెలిసిన వెంటనే 12 ఫైర్‌ ఇంజన్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకవచ్చేందుకు ప్రయత్నించాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.. ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.