పాక్‌కు ప్రధాన ముప్పు

పాక్‌కు ప్రధాన ముప్పు

క్రికెట్‌ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్‌ జట్ల మధ్య కనిపించే వైరానికి మరేదీ సాటి రాదని ఆ్రస్టేలియా మాజీ ఆటగాడు, పాక్‌ జట్టు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌ మాథ్యూ హేడెన్‌ అభిప్రాయ పడ్డాడు. ఆటగాడిగా తన కెరీర్‌లో యాషెస్‌ సమరాన్ని గొప్పగా భావించినా…ఒక ప్రేక్షకుడిగా చూసే కోణంలో భారత్, పాక్‌ మ్యాచ్‌పై ఉండే ఆసక్తి ఎక్కడా కనిపించదని అతను అన్నాడు.

ఈ సారి భారత్‌పై పాక్‌ విజయం సాధిస్తుందని హేడెన్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌, వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ల నుంచే పాక్‌కు ప్రధాన ముప్పు పొంచి ఉందని హెచ్చరించాడు. కాగా అక్టోబర్‌ 24న దాయాది పాకిస్తాన్‌ తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది.