సోమవారం జిల్లాలో బాణాసంచా యూనిట్లో మంటలు చెలరేగడంతో తొమ్మిది మంది చనిపోయారు. తొమ్మిది మంది మృతి పట్ల ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం తెలుపుతూ వారి కుటుంబాలకు నగదు సాయం ప్రకటించారు.
జిల్లాలోని విరగలూరు గ్రామంలో ఓ ప్రైవేట్ యూనిట్లో ఈ ఘటన జరగ్గా, అగ్నిప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. గాయపడిన ఐదుగురిని తంజావూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చి ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నామని సీఎం తెలిపారు.
సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు తన కేబినెట్ సహచరులు ఎస్ఎస్ శివశంకర్, సీవీ గణేశన్లను నియమించినట్లు స్టాలిన్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, సాధారణ గాయాలపాలైన వారికి రూ.50వేలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.