గుజరాత్ లోని సూరత్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 20 మంది విద్యార్థులు చనిపోయారు. మంటల్లో కాలిపోయి 14 మంది మంది విద్యార్థులు మరణించగా మంటలు ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పైనుంచి కిందకు దూకి మరో ఆరుగురు చనిపోయారు. మరికొందరికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సర్తానా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
రెండస్తుల భవనంలో కోచింగ్ సెంటర్ నడుస్తోంది. రోజూలాగే నిన్న కూడా చాలా మంది విద్యార్థులు క్లాసులకు హాజరయ్యారు. ఐతే అకస్మాత్తుగా ఆ బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కూడా అలుముకోవడంతో విద్యార్థులకు ఊపిరాడలేదు. పలువురు విద్యార్థులు శ్వాస ఆడక చనిపోగా మరికొందరు సజీవదహనమ్యారు. పలువురు విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పై నుంచి కిందకు దూకారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు