చట్ట విరుద్ధంగా ప్రవేశించిన భారతీయుల అరెస్ట్

చట్ట విరుద్ధంగా ప్రవేశించిన భారతీయుల అరెస్ట్

ఐదుగురు భారతీయులను ఒక అమెరికన్‌ తన వాహనంలో తీసుకు వస్తూ మోరిస్‌ టౌన్‌ చెక్‌ పాయింట్‌ను దాటేందుకు ప్రయత్నించగా అధికారులు అనుమానించడం వల్ల సమీపంలోని దుకాణం వద్ద వాహనాన్ని ఆపాడు. న్యూయార్క్‌ అధికారులు అమెరికాలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించిన ఐదుగురు భారతీయులను కస్టడీలోకి తీసుకున్నారు.

వాహనంలో ఉన్న భారతీయులు దుకాణంలోకి వెళ్లి దాక్కొనగా అధికారులు లోపలికి వెళ్లి తనిఖీ చేసారు. ఐదుగురు భారతీయుల వద్ద ఎలాంటి పత్రాలు లేవని తెలిసాక ఐదుగురినీ కస్టడీలోకి తీసుకున్నారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడిన వారిలో ఈ ఆర్థిక సంవత్సరంలో భారతీయుల సంఖ్య తొమ్మిది వేల పైనే ఉండటం గమనార్హం.