రోజురోజుకీ పూజా హెగ్డే కి పెరిగిపోతోన్న ఫాలోవర్స్‌

రోజురోజుకీ పూజా హెగ్డే కి పెరిగిపోతోన్న ఫాలోవర్స్‌

తెలుగు చిత్ర రంగంలో అగ్ర తారగా వెలుగుతోన్న పూజ అటు బాలీవుడ్‌లో కూడా ప్రయత్నాలు మానడం లేదు. ఎంత బిజీగా వున్నా కానీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ, అక్కడి ట్రోలింగ్‌కి అసలు అటెన్షన్‌ పే చేయకుండా బ్యాలెన్స్‌ ఎలా చేయాలనేది పూజకి బాగా తెలుసు. అందుకే ఆమె ఇంతవరకు సోషల్‌ మీడియాలో ఎలాంటి కాంట్రవర్సీలోను ల్యాండ్‌ అవలేదు.

అలాగే చాలా మంది హీరోయిన్లలా ప్రేమలో పడడం, తద్వారా వార్తల్లో నిలవడం కూడా ఆమె చేయదు. ఏది ఎంతలో వుంచాలనేది కూడా పూజకి బాగా తెలుసు. సోషల్‌ మీడియాలో ఫాస్టెస్ట్‌ రైజింగ్‌ సెలబ్రిటీస్‌లో ఆమె ఒకరు. ఇన్‌స్టాగ్రామ్‌లో పూజకి ఎనభై లక్షల ప్లస్‌ ఫాలోవర్స్‌ వున్నారు. ఈ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అటు తన సినిమాల అప్‌డేట్స్‌ మాత్రమే కాకుండా ఫోటోషూట్స్‌ నుంచి, రెగ్యులర్‌గా పార్టీలకి వేసే గెటప్స్‌ నుంచి అన్నిటినీ ఫాన్స్‌కి అప్‌డేట్‌ చేస్తూ వుంటుంది.

త్వరలోనే ఆమె ఇన్‌స్టాలో కోటి మార్కు దాటనుంది. ట్విట్టర్‌లో కూడా తనకు ఇరవై లక్షలకి పైగా ఫాలోవర్స్‌ వున్నారు. తెలుగు చిత్ర రంగంలో ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకుంటున్నది కూడా పూజానే అంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. సినిమా చేయడమే కాకుండా ప్రమోషన్‌ కూడా తన కర్తవ్యంలా భావించి నిర్మాతలకి ఎలాంటి అదనపు ఛార్జీలు వేయకుండా ఆమె అన్ని ప్రమోషనల్‌ ఈవెంట్స్‌కి హాజరవుతుందని పేరు.