బావమరిది ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన బావ

బావమరిది ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన బావ

ఓ వ్యక్తి తన బావమరిది ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామంలో జరిగింది. భార్యపై కక్ష్యతో లక్ష్మీరాజ్యం అనే వ్యక్తి వ్యక్తి బావమరిది ఇంటిపై పెట్రోల్‌ పోయగా ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారిని హైదరాబాద్‌ గాంధీ ఆస్సత్రికి తరలించారు. సిద్ధిపేట ఏరియా ఆస్పత్రికి మిగతా వారిని తరలించారు. నిందితుడి భార్య రాజేశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజేశ్వరి మిగత కుటుంబ సభ్యులకికూడా తీవ్ర గాయాలయ్యాయి.

నిందితుడు లక్ష్మీరాజ్యం తన భార్యతో కొద్దిరోజులుగా గొడవ పడుతున్నాడు. తన బావమరిది సర్థిచెప్పే ప్రయత్నంలో గొడవ మరింత పెరిగి ఈ పరిస్థితికి దారి తీసింది. బావమరిదిపై కక్ష్య పెట్టుకున్న బావ లక్ష్మీరాజ్యం బావమరిది కుటుంబం ఇంట్లో ఉన్న సమయంలో పెట్రోల్‌ పోసి నిప్పు అంటించాడు. నిప్పంటించి వెంటనే అక్కడి నుండి పారిపోగా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.