“అల వైకుంఠపురములో” టీజర్ విడుదలలో అంతరాయం

“అల వైకుంఠపురములో” టీజర్ విడుదలలో అంతరాయం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “అల వైకుంఠపురములో”అయితే ఈ చిత్రంకు సంబంధించి ఈరోజు థర్డ్ సింగిల్ “ఓహ్ మై గాడ్ డాడీ” కోసం అభిమానులు మరియు సంగీత ప్రియులు ఎంతలా ఎదురు చూస్తున్నారో అందరికి తెలుసు అంతే కాకుండా ఈ రోజు మహేష్ నటిస్తున్న “సరిలేరు నీకెవ్వరు” టీజర్ కూడా ఒక గంట తర్వాత ఉండడంతో మరోసారి సినీ వర్గాల్లో పరిస్థితులు మారాయి.

బన్నీ సాంగ్ 4 గంటల 5 నిమిషాలకు అయితే మహేష్ టీజర్ 5 గంటల 4 నిమిషాలకు వస్తాయని ముందు గానే ప్రకటించారు.కానీ అనూహ్యంగా బన్నీ సాంగ్ రాలేదు.దీనికి అసలు కారణం ఇప్పుడు మా దగ్గర ఉంది.ఈ సాంగ్ ను చిత్ర యూనిట్ కావాలనే ఆపిందని అంతే కాకుండా “సరిలేరు నీకెవ్వరు” టీజర్ సమయానికే లేదా ఒకటి రెండు నిముషాలు అటు ఇటుగా విడుదల చేస్తారని అంతర్గత సమాచారం.ఇప్పటికే ఇద్దరి అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ లేపేస్తున్నారు.ఇప్పుడు రెండు ఒకేసారి అంటే ఇక ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.మొత్తానికి సాంగ్ మాత్రం ఇప్పుడు 5 గంటలకే రాబోతుంది.