కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌కు విమానాల రాకపోకలు

కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌కు విమానాల రాకపోకలు

కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌కు అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కాబూల్‌కు పాకిస్తాన్‌ సోమవారం తొలి కమర్షియల్‌ విమానాన్ని నడిపింది. అఫ్గాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అంతర్జాతీయ స్థాయిలో కాబూల్‌ వెళ్లిన మొదటి కమర్షియల్‌ విమానం పాకిస్తాన్‌కు చెందినదే కావడం గమనార్హం.

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ పాకిస్తాన్‌ ఇంటర్నేషన్‌ ఎయిర్‌లైన్‌ (పీఐఏ) విమానం –పీకే 6429 పలువురు జర్నలిస్టులతో కలసి కాబూల్‌ వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ మీడియా సంస్థలకు చెందిన బృందంతో వచ్చిందని రేడియో పాకిస్తాన్‌ వెల్లడించింది. అంతర్జాతీయ విమానాలు కూడా త్వరలోనే తిరుగుతాయని భావిస్తున్నారు.