Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉమ్మడి ఏపీ చివరి సీఎంగా నల్లారి చరిత్రలోనే కాదు రెండు రాష్ట్రాల ప్రజల ఆలోచనల్లో కూడా నిలిచిపోయారు. ఏపీలో కొంతకాలం పాటు ఆయన హీరోగా చలామణీ అయితే.. తెలంగాణలో ఆయన్ను విలన్ గా చూశారు. కానీ సింగరేణిలో రోజుల తరబడి స్ట్రైక్ జరిగినా.. కరెంట్ ప్రాబ్లమ్ రాకుండా చూడటం, హైదరాబాద్ జోన్ ఇష్యూను సాల్వ్ చేయడంతో.. తెలంగాణలో కొంతమందికి కూడా ఇష్టుడయ్యారు.
రాష్ట్రాన్ని విడగొట్టనివ్వనని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన కిరణ్.. ప్రజల అండ ఉందనే అతి విశ్వాసంతో పదవిచ్చిన అధిష్ఠానాన్నే ధిక్కరించారు. చివరకు ఇష్టం లేకుండానే రాజీనామా చేయాల్సి వచ్చింది. అయినా అంతటితో ఆగకుండా సోనియాకు వ్యతిరేకంగా జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి డిపాజిట్లు కూడా కోల్పోయి పరువు పోగొట్టుకున్నారు.
కానీ రాజకీయం ఓ వ్యసనం. అందుకే నల్లారి మళ్లీ ఏదో పార్టీలో చేరాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ ఆయన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఆయన సొంత నియోజకవర్గంలోనే పాపులారిటీ లేదని, అలాంటి నేతను ఏం చేసుకోవాలని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. అయితే కిరణ్ మాత్రం సన్నిహితుల ద్వారా మీడియాకు పొలిటికల్ లీకులిప్పించి తన గాసిప్స్ ఎంజాయ్ చేసే దుస్థితికి దిగజారారు.
మరిన్ని వార్తలు