Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ లో ఉనికి కోల్పోయినా కాంగ్రెస్ బుద్ధి మారలేదు. 2014 ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే స్థానం దక్కకపోయినా హస్తం బాణీ మారలేదు. నిన్నటికి నిన్న రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన కాంగ్రెస్ నాయకురాలు మీరా కుమార్ కి ఏపీ నుంచి ఒక్క ఓటు పడలేదు. అయినా కాంగ్రెస్ కళ్ళు తెరుచుకోలేదు. వచ్చే ఎన్నికల నాటికి మొత్తం 175 స్థానాల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితిలో వున్న కాంగ్రెస్ నియోజకవర్గాల సంఖ్య 225 కి పెరిగితే తమ పరిస్థితి ఏంటా అని బెంబేలెత్తుతోంది. అయినా ఆ పార్టీ నాయకులు పద్ధతిపాడు లేకుండా మాట్లాడుతున్నారు. వున్న 3 శాతం ఓట్లకు కూడా కన్నం పెట్టేస్తున్నారు.
మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ విజయవాడ వచ్చిన సందర్భంగా ప్రెస్ తో మాట్లాడారు. ఏపీ సర్కార్, సీఎం చంద్రబాబు మీద రాజకీయ ఆరోపణలు చేశారు. ఎన్నికల హామీలు, ప్రభుత్వ వైఫల్యాల గురించి కొన్ని విమర్శలు చేశారు. రాజకీయాల్లో అది సహజమే అనుకోవచ్చు. కానీ ఆయన రాజధాని అమరావతిలో భాగమైన తుళ్లూరు గురించి మాట్లాడిందే అభ్యంతరకరం. తుళ్లూరు శాపగ్రస్త ప్రాంతమని , అక్కడికి వెళ్లిన వాళ్ళు పతనం అవుతారని మాట్లాడారు. ఎంపీ, కేంద్రమంత్రిగా పనిచేసిన వాళ్ళు ఈ స్థాయిలో మాట్లాడితే ఇంకేమి చెప్తాము?. తుళ్లూరు ప్రాంతంలో వేల సంవత్సరాలుగా ఉంటున్న వారి మనోభావాల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరించారు చింతా మోహన్. ఆయన లాగా మాట్లాడితే 2019 నాటికి ఈ రెండు మూడు శాతం ఓట్లు కూడా రాకుండా పోతాయి.
మరిన్ని వార్తలు