క్షమాపణలు కోరిన మాజీ క్రికెటర్

క్షమాపణలు కోరిన మాజీ క్రికెటర్

భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ అనుష్క శర్మని క్షమాపణలు కోరాడు. భారత సెలక్టర్లు కూడా వయసు తగినట్లు ఆలోచించి మాట్లాడాలని చురకలేశారు. టీమిండియా బ్లేజర్ వేసుకుని వరల్డ్‌ కప్ టైమ్‌లో ఒక వ్యక్తి అనుష్క శర్మకి టీ అందించాడు. ఎవరు నువ్వు అని అతడ్ని అనుష్క శర్మ ప్రశ్నించగా వెంటనే టీమిండియా సెలక్టర్‌ని అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు.

భారత సెలక్టర్లలో ఒకరు వన్డే ప్రపంచ కప్‌ సమయంలో కోహ్లీ భార్య అనుష్క శర్మకి టీ మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజినీర్ సర్వ్ చేశాడని ఆరోపణలు చేశారు. దీనిపై ఫరూక్ ఇంజినీర్ క్షమాపణలు చెప్పారు. వరల్డ్‌ కప్ టైమ్‌లో తాను ఒక్క మ్యాచ్‌‌కి మాత్రమే హాజరయి ఫ్యామిలీలు కూర్చునే గ్యాలరీలోనే కూర్చున్నట్లు అనుష్క శర్మ తెలిపింది. అనవసరంగా వివాదాల్లోకి లాగొద్దంటూ ఫరూక్‌కి ఘాటుగా రిప్లై ఇవ్వడంతో భారత క్రికెట్‌లో కూడా చర్చ జరగింది. వెంటనే మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజినీర్ క్షమాపణలు కోరాడు.