Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కార్గిల్ దురాక్రమణతో పాక్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆదేశ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కు భారత్ అంటే తమకు భయమన్న విషయాన్ని బయటపెట్టారు. కార్గిల్ వార్ తర్వాత మూడేళ్లకే పార్లమెంటుపై దాడి జరిగిందని, ఆ సమయంలో దాయాదుల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆ సమయంలో అణుదాడి చేయాలనే ఆలోచన పాక్ కు వచ్చిందట.
కానీ ఇండియా సామర్థ్యం తెలిసి ఉండటం, ప్రతిదాడులు చేస్తే తమ దేశం మిగలదనే భయంతోనే ముషారఫ్ ఆ యోచన విరమించుకున్నారట. ఓ జపాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషారఫ్ ఈ విషయం చెప్పారు. పదవిలో ఉన్నన్నాళ్లూ నియంతలా వ్యవహరించిన ముషారఫ్.. ఇప్పుడు ప్రవాస జీవితం గడుపూత తన తీపి జ్ఞాపకాలు నెమరవేసుకుంటున్నారు.
కానీ చాలా సందర్భాల్లో ఆయన భారత్ కు అనుకూలంగా మాట్లాడటం పాక్ కు మింగుడు పడటం లేదు. ప్రవాస జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముషారఫ్ వ్యూహాత్మక వ్యాఖ్యలు చేస్తున్నారని ఇండియన్ మిలటరీ అభిప్రాయపడుతోంది. ముషారఫ్ తేనె పూసిన కత్తి అని, జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీ నాయకత్వానికి ఆర్మీ నుంచి హెచ్చరికలు కూడా వెళ్లిపోయాయి.
మరిన్ని వార్తలు: