ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. గత సంవత్సరం సెప్టెంబరు నెలలో ఢిల్లీలోని ఓప్రైవేటు ఆసుపత్రిలోచేరిన ఆయనకు అక్కడ మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదురైనట్లు వైద్యవర్గాలు తెలిపాయి. 92 ఏళ్ల తివారీకి గత సంవత్సరం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఉన్న ఆయనకు మరిన్ని సమస్యలు తలెత్తడంతో ఆయనను ఐసీయూకు తరలించారు. కిడ్నీలు పనిచేయక పోవడంతో ఆయనకు డయాలసిస్ నిర్వహిస్తున్నట్టు ఆయన కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ వెల్లడించారు. అలాగే తాను తివారీ కుమారుడు రోహిత్ శేఖర్‌తో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి ఆరాతీసినట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్ ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్ ప్రజలందరి తరఫున తివారీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.