నలుగురు కూలీలు మృతి

నలుగురు కూలీలు మృతి

మైదుకూరు మండలం ఆదిరెడ్డిపల్లె వద్ద విషాదం చోటుచేసుకుంది. జేసీబీ అదుపుతప్పి రోడ్డుపై ఉన్న కూలీల మీదకు దూసుకెళ్లడంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలవ్వగా.. ఆసుపత్రికి తరలించారు.

మృతులంతా కేసలింగాయపల్లె గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కాగా పొలం పనులకు వెళ్లి ఆటో కోసం వేచి చూస్తున్న కూలీలను జేసీబీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జేసీబీ డ్రైవర్‌ మద్యం మత్తులోఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.