ఒక్క రోజులో కోటీశ్వరులైన స్నేహితులు

ఒక్క రోజులో కోటీశ్వరులైన స్నేహితులు

ఓ జ్యువెలరీ షాపులో పని చేసే ఆరుగురు చిరు ఉద్యోగుల కలిసి పండగ వేళ ఓ లాటరీ టికెట్ కొన్నారు. అదృష్ట దేవత వరించడంతో.. రూ.12 కోట్ల బంపర్ ఆఫర్ వారిని వరించింది. కేరళలోని అలప్పుజ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజీవన్, రాంజీమ్, రోనీ, వివేక్, సుబిన్, రతీష్ అనే ఆరుగురు ఓ జ్యువెలరీ షాపులో సేల్స్ విభాగంలో పని చేస్తుంటారు. రెండు రోజుల క్రితం కేరళ  ఓనమ్ బంపర్ లాటరీ కొన్నారు.

గురువారం మధ్యాహ్నం వెల్లడించిన లాటరీ ఫలితాల్లో లక్కీగా వారు కొన్న టికెట్‌కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దీంతో ఒక్కరోజులోనే వారు కోటీశ్వరులయ్యారు. రూ.12 కోట్ల విలువైన లాటరీ జాక్ పాట్ తగలడంతో ఆరుగురు స్నేహితులు తెగ ఆనందపడిపోతున్నారు. ఈ డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడటమే కాకుండా సమాజం కోసం కూడా ఖర్చు చేస్తామంటున్నారు.