ఇకపై మధ్యాహ్న భోజనంలో ఎగ్ ఫ్రైడ్ రైస్..

పిల్లలకు బలమైన శరీరాన్ని, బుద్ధిమంతమైన మనసును అందించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో కొత్త పరిణామాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు రుచికరమైన, ఇంకా ఎక్కువ పోషకాలు కలిగిన ఆహారం అందించేందుకు మెనూ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై వారంలో రెండు రోజులు మధ్యాహ్నం ఎగ్ ఫ్రైడ్ రైస్, అదేరోజు ఉదయం అల్పాహారంగా ఉడికించిన శనగలు ఇవ్వనున్నారు. దీంతో పిల్లలకు అవసరమైన ప్రోటీన్, మినరల్స్ పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.