పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ ల్లో రెండు భారీ పాన్ ఇండియా మూవీ లతో పాటుగా ఒక రీజనల్ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. మరి ఆ మూవీ నే దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్”. చాలా ఏళ్ళు తర్వాత చేస్తున్న మూవీ ఇది కావడంతో దీనిపై సాలిడ్ హైప్ నెలకొంది. అలాగే దీనితో పాటుగా మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ కు కూడా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ మూవీ విషయంలో మొదటి నుంచి తమిళ మూవీ తేరి కు రీమేక్ అంటూ పెద్ద రచ్చ నడిచిన సంగతి తెలిసిందే. అయితే అసలు ఇది ఆ మూవీ కి రీమేక్ కాదు అని ఈ మూవీ కి రచయితగా వర్క్ చేస్తున్న దశరద్ చెప్పిన మాటలు వైరల్ గా మారాయి. ఆ మూవీ దానికి రీమేక్ కాదు కానీ ఏవో పోలికలు కనిపించి ఉండొచ్చు కానీ రీమేక్ అయితే కాదు అని అంటున్నారు. మరి ఈ మూవీ రీమేక్ కాదు స్ట్రైట్ మూవీ అని హరీష్ శంకర్ అయితే ఇప్పుడు వరకు ఎక్కడా చెప్పలేదు. మరి దీనిపై ఫ్యాన్స్ ఏమంటారో చూడాలి.