షాక్ : అంత్యక్రియలకు హాజరైన 18మందికి కరోనా..

కరోనా మహమ్మారి చాలా తీవ్రంగా ప్రజలపై దాడి చేస్తుంది. అసలు ఈ వైరస్ కారణంగా ఇంట్లోంచి మనిషి బయటకు వెళ్లాలంటేనే భయపడి పోతున్నాడు. ఎటుపోయినా దాని తీవ్రత కారణంగా మనిషి చాలా భయభ్రాంతులకు గురౌతున్నాడు. తాజాగ కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు వెళ్ళిన 18 మందికి కరోనా సోకింది. దీంతో ప్రభుత్వ పెచ్చిన నిషేద ఉత్తర్వులను లెక్కచేయకుండా వ్యవహరించి కరోనా తెచ్చుకున్నారు మహారాష్ట్రలోని 18 మంది వ్యక్తులు.

అసలేం జరిగింది అంటే.. 40 ఏళ్ళ ఓ మహిళ కరోనాతో మృతి చెందింది. తక్కువ మందితో పూర్తి చేయాల్సిన అంత్యక్రియలకు ఏకంగా 70 మందికి పైగా హాజరయ్యారు. మహిళ మరణించిన తర్వాత ఉల్లాస్‌ నగర్‌ మున్సిపల్‌ అధికారులు ఆమెకు కరోనా పరిక్షలు చేయించారు. చనిపోయిన మహిళకు కరోనా ఉందని నిర్ధారణ కావడంతో ఆమె శవాన్ని ప్యాక్‌ చేసి అంతిమ కర్మలను చేసేందుకు కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు. కాగా ప్యాక్‌ చేసిన శవాన్ని తెరవకుండా అంతిమ సంస్కరణలు చేసుకో వచ్చని అధికారులు వారికి తెలిపారు. అయినప్పటికీ కూడా అధికారుల ఆదేశాలు బేఖాతరు చేసిన బంధువులు శవాన్ని తెరిచి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో 70 మందికి అధికారులు కరోనా టెస్టులు చేశారు. వారిలో ఏకంగా 18 మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. దీంతో వారికి కరోనా తీవ్రత తెలిసి వచ్చినట్లైంది.