మరణానికి ముందు పవన్‌ కల్యాణ్‌కు గద్దర్ ఆడియో ఫైల్.. అందులో ఏముంది? ఇన్సాటాలో పవర్‌స్టార్ వీడియో వైరల్…

Pawan Kalyan
Pawan Kalyan

ప్రజా యుద్ధ నొక్క గద్దర్ ఇకలేరు అనే వార్తతో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు మృతి వార్త బయటకు రాగానే హైదరాబాదులో ఎల్బీ స్టేడియానికి వెళ్లి గద్దర్ దేహానికి పార్టీ శ్రద్ధాంజలి కట్టించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీరు ఆగడం లేదని చెప్పారు.

గద్దర్ అంత్యక్రియలు ముగియగానే తన ప్రేమను, ఆవేదనను కవితా రూపంలో వెల్లడించారు. పవన్ కల్యాణ్ ఇన్స్‌టాలో కూడా పోస్టు చేసిన కవితా వివరాల్లోకి .. వెళ్ళితే ఎల్బీ స్టేడియంలో శ్రద్దాంజలి ఘటించిన అనంతరం.. ప్రతీ సంవత్సరం కొద్ది నెలలు, కొద్ది రోజులు గద్దర్, నేను కూర్చొనే వాళ్లం. గత మూడు సంవత్సరాలుగా ఆయనను కలవడం కుదరడం లేదు.మొన్న అన్నకు బాగోలేదని తెలిస్తే అపోలో హాస్పటల్ కు పోయి గద్దర్ అన్నను కలిసాను ఎన్నోసార్లు మృత్యువతో పోరాటం చేసిన ఆయన త్వరగా కోలుకుంటాడని అనుకున్నాను.

కానీ ఇలా అవుతుందని అనుకోలేదు అని పవన్ కల్యాణ్ అన్నారు.గద్దర్ ఇకలేరనే విషయాన్ని అసలకీ జీర్ణించుకోలేకపోతున్నాను. ఎంతటి దు:ఖాన్నైనా, కన్నీటినైనా గుండెల్లో పెట్టుకోగలను. కానీ ఈ రోజు నావల్ల కావడం లేదు. ఆపరేషన్‌కు గద్దర్ అన్న ఆడియో మెసేజ్ పంపించారు. పిడత వర్గాల తరఫున పోరాడే వాళ్ళంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన అవే విషయాలు ఆడియో ఫైల్‌లో పేర్కొన్నారు అని పవన్ కల్యాణ్ చెప్పారు.

రాజకీయాల్లో చాలా కష్టాలు ఉంటాయి. ఒంటరిగా పోరాటం చేస్తున్నావు జాగ్రత్త నీదే విజయం అని అంటే.. మీరే నాకు స్పూర్తి అని చెప్పాను. నా అంతిమ లక్ష్యంపిడతా వర్గాలకు చేయడమే అని చెప్పాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. పవన్ కల్యాణ్ 100 శాతం కరెక్ట్.. ఎవడి సొత్తు కాదు.. చిరంజీవి ఎమోషనల్ గద్దర్ అంత్యక్రియల ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో వీడియోను పోస్టు చేశారు. తనలోని భావోద్వేగాన్ని కవిత రూపంలో విన్నవించుకొన్నారు.

పవన్ కల్యాణ్ రిలీజ్ చేసిన వీడియో వివరాల్లోకి వెళితే.. బీటలు వారిన ఎండలో సమ్మెట కొట్టే కూలీకి గొడుగు గద్దర్ తాండా పాండాలో చలిపులిని బెదిరించే నెగడు గద్దర్ పీడిత జనుల పాట గద్దర్ అణగారిన ఆర్తుల ఆసరా గద్దర్ అడివిలో ఆకు చెప్పిన కథ గద్దర్ కోయిల పాడిన కావ్యం గద్దర్ గుండెకు గొంతు వస్తే బాధకు భాష వస్తే అది గద్దార్ అన్నిటికి మంచి నా అన్న గాధర్ అన్న… ఓ గాయపడ్డ పాటవి కానీ ప్రజల గాయాలకు కట్టుబడ్డ పాటవు అన్యాయంపై తిరగబడిన పాటవు ఇదివరకు నీవు ధ్వనించే పాటవి ఇప్పుడు కొన్ని లక్షల పాటల్లోప్రతి ధ్వనించే పాటవి తీరం చేరిన ప్రజా యుద్ధ నౌకకు జోహార్.. జోహార్.. జోహార్