ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ మెయిన్ గా సినిమా లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమా “గామి”. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా చాందిని చౌదరి ఫీమేల్ లీడ్ లో అనేక మంది ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీ ని దర్శకుడు విద్యాధర్ తెరకెక్కించాడు. మరి ఫుల్ ప్రమోషన్స్ ను జరుపుకుంటున్న ఈ మూవీ నిన్ననే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా జరుపుకుంది.

అయితే ఈ మూవీ పై ఉన్న బజ్ కు యూఎస్ మార్కెట్ లో మాత్రం సాలిడ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి ఈ మూవీ కేవలం ప్రీ సేల్స్ తోనే యూఎస్ లో అప్పుడే లక్ష డాలర్స్ మార్క్ దగ్గరకి స్ట్రాంగ్ నంబర్స్ తో దూసుకెళ్తుంది. మరి ఇదే సమయంలో మంచి టాక్ కానీ ఓవర్సీస్ లో గామి మరిన్ని భారీ నంబర్స్ ని సెట్ చేసినా ఆశ్చర్యం లేదని చెప్పాలి. ఇక ఈ మూవీ కి నరేష్ కుమరన్ సంగీతం అందించగా క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మాణం వహించారు. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ వి సెల్యులాయిడ్ వారి సమర్పణలో ఈ మూవీ గ్రాండ్ గా రేపు రిలీజ్ కాబోతుంది.