గ్యాంగ్ మూవీ టీజర్… సూర్య పెర్ఫార్మెన్స్ అదుర్స్

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Gang Official Telugu Teaser

తమిళ స్టార్‌ హీరో సూర్య తన ప్రతి సినిమాను కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. తాజాగా తమిళంలో ఆయన నటించిన చిత్రాన్ని తెలుగులో ‘గ్యాంగ్‌’గా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవలే తమిళంలో ఆ చిత్రం టీజర్‌ విడుదల అయ్యింది. కాస్త ఆలస్యంగా తెలుగులో కూడా ‘గ్యాంగ్‌’ టీజర్‌ను విడుదల చేశాడు. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తుంది. ‘గ్యాంగ్‌’ టీజర్‌ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. సూర్య పాత్ర చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌తో, ఎనర్జిటిక్‌తో కూడి ఉంటుందని టీజర్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది.

టీజర్‌లోనే సూర్య పాత్రలో పలు వేరియేషన్స్‌ను దర్శకుడు చూపించడం జరిగింది. ఒక పవర్‌ ఫుల్‌ అధికారికగా సూర్య కనిపించబోతున్నట్లుగా అనిపస్తుంది. అదే మాదిరిగా ఒక ఫన్నీ గైయ్‌గా కూడా సూర్య కనిపిస్తాడని టీజర్‌ను చూస్తే అర్థం అవుతుంది. సూర్య మరియు రమ్యకృష్ణల మద్య పలు వినోదాత్మక సీన్స్‌ ఉంటాయని కూడా అనిపిస్తుంది. తెలుగులో కీర్తి సురేష్‌కు ప్రస్తుతం భారీ క్రేజ్‌ ఉంది. ఆ క్రేజ్‌తో ‘గ్యాంగ్‌’ చిత్రానికి మంచి బిజినెస్‌ జరిగే అవకాశం ఉంది. సూర్య గత కొంత కాలంగా తెలుగులో సాలిడ్‌ హిట్‌ లేక అవస్థలు పడుతున్నాడు. ఈ చిత్రంతో అయినా తెలుగులో సూర్యకు మంచి సక్సెస్‌ దక్కుతుందేమో చూడాలి.