రోజాది కోపం కాదు ఒత్తిడి.

reason behind roja comments on bandla ganesh about pawan kalyan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టీవీ 9 లో రోజా, బండ్ల గణేష్ మధ్య మాటల యుద్ధం బూతు పురాణం వైపు దారి తీసిన వైనం అందరూ చూసారు. చర్చలో పాల్గొన్న వాళ్ళు ఇద్దరూ నోటి దూకుడు ఎక్కువ ఉన్నవాళ్లే. ఇక చర్చ పెట్టిందేమో టీవీ 9 . అందుకే ఈ గొడవ ఎవరినీ పెద్దగా ఆశ్చర్యపరచలేదు. కానీ మరోసారి రోజా , బండ్ల గణేష్ తమ నోటిని అదుపు చేసుకోలేని బలహీనతను బయటపెట్టుకున్నారు. బండ్ల గణేష్ సినిమా రంగం నుంచి వచ్చినవాడు. పైగా ఇప్పటిదాకా ప్రత్యక్ష రాజకీయాల్లో సంబంధం ఉన్నోడు కాదు. కానీ రోజా విషయం వేరు. ఆమె ఇప్పటికే ఈ నోటి దూకుడు వల్ల ఎమ్మెల్యేగా గెలిచినా అసెంబ్లీకి వెళ్లలేని పరిస్థితి తెచ్చుకున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలకు టార్గెట్ అయ్యారు. ఇంతాచేసి చివరకు సొంత పార్టీ అధినేత జగన్ సైతం ఆమెను నోటి దూకుడు తగ్గించుకోమని హెచ్చరిస్తున్నారు. ఇదంతా చూసాక , ఇన్ని అనుభవాలు ఎదురు అయ్యాక కూడా రోజా లో కించిత్ మార్పు కూడా రాకపోవడం , ఆమె కోపం తగ్గకపోవడం మీద ఓ సైకాలజిస్ట్ ని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన వివరణ ఇలా వుంది.

“ నిజానికి రోజాది కోపం కాదట. ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉండటం వల్ల సంయమనం కోల్పోతున్నారట. అది బయటకు కోపంగా అనిపించినా ఒత్తిడి వల్లే ఆమె ఇలా వ్యవహరిస్తున్నారు. సినిమా రంగానికి రోజా అనుకోకుండా వచ్చారు. సక్సెస్ అయ్యారు. తెలుగు , తమిళ రంగాల్లో తనదైన ముద్ర వేశారు. ఇక రాజకీయాన్ని మాత్రం రోజా ఎంతో సీరియస్ గా తీసుకున్నారు. అనుకోకుండా వచ్చిన సినీ రంగంలోనే ఇంత సక్సెస్ అయినప్పుడు ఇంత సీరియస్ గా వర్క్ చేస్తున్న రాజకీయంలో ఎలాగైనా సక్సెస్ అవుతామని ఆమె అనుకున్నారు. అయితే రాజకీయాల్లో రెండు ఓటములు, పార్టీ మారాక ఎమ్మెల్యేగా గెలిచినా వైసీపీ అధికారంలోకి రాకపోవడం, పైగా తన మీద ఐరన్ లెగ్ అని ముద్రపడడం, ఎంత యుద్ధం చేసినా సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు రావడంతో రోజా తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు. దీంతో భావోద్వేగాల మీద అదుపు కోల్పోయి తేలిగ్గా బరస్ట్ అవుతున్నారు. దీన్ని నియంత్రించాలంటే ముందుగా తాను వున్న పరిస్థితిని అంటే వైఫల్యాలు , ఫైర్ బ్రాండ్ ముద్ర ని ముందుగా మానసికంగా అంగీకరించడం అన్నిటికన్నా ముఖ్యమట. ఆపై తన పరిధిలో వున్న అంశాలను మార్చుకోవడం , లేని వాటిని వదిలేయడం వల్ల రోజా ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.” …మానసిక నిపుణుడు చేసిన ఈ విశ్లేషణ రోజా ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.