గ్యాంగ్… తెలుగు బుల్లెట్ రివ్యూ

Gang Movie review
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నటీనటులు :    సూర్య, కీర్తి సురేష్, రమ్య కృష్ణ… 
దర్శకత్వం :   విగ్నేష్ శివన్ 
సినిమాటోగ్రఫీ:   దినేష్ కృష్ణన్ 
ఎడిటర్ :   శ్రీకర్ ప్రసాద్  
మ్యూజిక్ :   అనిరుద్ 

 

‘సూర్య’ తమిళంలో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో సూర్య కి మన టాలీవుడ్ హీరోలకి ఉన్న మార్కెట్ కూడా ఉంది. అందుకే ఎప్పుడు తమిళంలో పాటు తెలుగులో కూడా తన సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు సూర్య ‘గ్యాంగ్’ చిత్రం ద్వారా తమిళ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గ్యాంగ్ చిత్రం బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘స్పెషల్ 26’ ఆధారంగా తీయబడింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, కాజల్ అగర్వాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నీరజ్ పాండే ఈ చిత్రానికిదర్శకత్వం వహించాడు.

కథ…

తిలక్ (సూర్య) సిబిఐలో ఉద్యోగం సంపాదించి, అవినీతి పరుల ఆట కట్టించాలనుకుంటాడు. దీనికోసం చాలా కష్టపడతాడు, కానీ ఆ ఉద్యోగానికి లంచం కట్టాల్సి వస్తుంది, దానికి తిలక్ ఒప్పుకోకపోవడంతో సిబిఐలో ఉద్యోగం సంపాదించడంలో విఫలమవుతాడు. అప్పుడు తిలక్ లంచం అడిగిన వాళ్ళమీద, లంచం తీసుకునే వాళ్ళ మీద పగ తీర్చుకోవలనుకుంటాడు, దానికోసం ఝాన్సీ రాణి (రమ్య కృష్ణన్) సహాయంతో ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసి నకిలీ దాడులను చేస్తూ ఉంటాడు. ఈ ప్రక్రియలో, నిజమైనా సిబిఐ అధికారులు దీని గురించి తెలుసుకొని వారిని పట్టుకోవాలనుకుంటారు. నిజమైన సిబిఐ అధికారులు ఈ గ్యాంగ్ ని పట్టుకుంటారా? చివరికి ఏమి జరుగుతుంది? అసలు తిలక్ కి సిబిఐలో ఉద్యోగం రాకుండా చేసిన వాళ్ళు ఎవరు అని తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ…

సూర్య ఈ గ్యాంగ్ సినిమాకి ప్రాణం పోసాడు. ముఖ్యంగా ఈ గ్యాంగ్ సినిమాలో సూర్య నటన, కామెడీ, యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్ నిలిచాయి. ఇకపోతే హీరోయిన్ కీర్తి సురేష్, గ్యాంగ్ సినిమాలో ఈమె కి పెద్దగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్ లేదు, ఈమె కేవలం పాటలు, గ్లామర్ కే పరిమితం అయింది. ఇక శివగామి రమ్య కృష్ణ నటన గురించి చెప్పాల్సిన అవసరంలేదు. తన నటన, తన కామెడీ టైమింగ్ తో ఈ సినిమా స్థాయిని పెంచేసింది. మిగిలిన గ్యాంగ్ టీం వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

ఈ గ్యాంగ్ సినిమాకి డైరెక్టర్ విగ్నేష్ శివన్ మంచి కథ ఎంచుకున్నాడు. విగ్నేష్ శివన్ తమిళ కథని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు కూడా చేసాడు. దర్శకుడు చేసిన కొన్ని మార్పులు ప్రేక్షకులను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. కొన్ని కొన్ని సన్నివేశాలలో తమిళ వాసన కనపడుతుంది… గ్యాంగ్ సినిమాకి శశాంక్ వెన్నెలకంటి అధ్బుతమైన మాటలు అందించాడు. ఈ చిత్రానికి దినేష్ కృష్ణన్ కెమెరా పనితనం చాలా బాగుంది. ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగా చేసాడు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ పర్వాలేదు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఇచ్చాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి, మంచి మంచి లొకేషన్లలో ఈ సినిమాను రూపొందించారు. మొత్తం మీద సాంకేతిక అంశాలు బాగా వచ్చాయి.

ప్లస్ పాయింట్స్ …

కథ
సూర్య
కామెడీ
డైలాగ్స్

మైనస్ పాయింట్స్ …

స్క్రీన్ ప్లే
కొన్ని సన్నివేశాలు

తెలుగు బులెట్ రేటింగ్… 2.75/5.