ఏడాదిగా బాలిక మీద గ్యాంగ్ రేప్….ఒకరికి తెలీకుండా ఒకరిగా ఆరుగురు ! 

gang-rape-on-girl-for-one-year

కామాంధులు రెచ్చిపోతున్నారు, వరుసగా అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా 16 ఏళ్ల బాలికపై ఆరుగురు దుర్మార్గులు ఒకరికి తెలీకుండా ఒకరు అత్యాచారానికి ఒడిగట్టారు. అలా ఏడాదిగా ఆ బాలికకు నరకం చూపించడంతో ఆ టార్చర్ తట్టుకోలేని బాధితురాలు ఎట్టకేలకి పోలీసుల ముందుకు వేలలో ఫిర్యాదు చేసింది.

అందుతున్న వివరాల ప్రకారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 16ఏళ్ల బాలిక తల్లి చనిపోవడంతో ఆమె తండ్రి చదువు మాన్పించి మరో కూతురితో కలిసి వాచ్‌మెన్‌గా చేరాడు. ఇద్దరు కూతుళ్లు తండ్రితో పాటూ ఉంటూ చిన్న, చిన్న పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలిక ఉంటున్న ఇంటి పక్కనే ఉండే ఓ క్యాటరింగ్ కాంట్రాక్టర్. తన పిల్లల్ని చూసుకోవడానికి బాలికను పంపించమని తండ్రిని అడిగాడు. బాలిక రోజూ వచ్చి తన పిల్లల్ని చూసుకుంటే మంచి జీతం ఇస్తానని చెప్పాడు.

రోజూ బాలిక ఆ కాంట్రాక్టర్ ఇంటికి వెళ్లి పిల్లల్ని చూసుకుంటుంది. కొద్ది రోజులకు కాంట్రాక్టర్ కన్ను బాలికపై పడింది.. ఆమెకు మాయ మాటలు చెప్పి అత్యాచారం చేశాడు. రోజూ ఆమెకు పోర్న్ వీడియోలు చూపిస్తూ అఘాయిత్యానికి ఒడిగట్టేవాడు. తండ్రి చేస్తున్న పని గమనించిన అతని మైనర్ కొడుకు కూడా బాలికను బెదిరించి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

పాపం బాలిక తన కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలీక గతంలో స్కూల్‌లో చదివే సమయంలో ఫ్రెండ్ అయిన మరో బాలుడికి చెప్పుకుంటే, ఇదే అదనుగా భావించిన ఆ కుర్రాడు కూడా ఆమెను బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. తర్వాత ఈ విషయం అతడి సోదరుడికి తెలియడంతో అతడు కూడా బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఈ నలుగురు పెట్టే టార్చర్‌తో ఆమె భరించలేక తనలో తానే కుమిలిపోయింది. మానసికంగా వేదనకు గురైన బాలికపై.. ఆమె ఇంటి పక్కన ఉన్న మరో ఇద్దరు యువకులు బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టారు. ఇలా ఆరుగురు కలిసి ఆమెకు నరకం చూపించారు వారి వేధింపుల్ని తట్టుకోలేని బాధిుతురాలు తండ్రికి తన బాధను చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది. అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.