పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఒక యువతి మీద జరిగిన గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. అందుతున్న సమాచారం ప్రకార ఏలూరు నగర శివారులో 22 ఏళ్ల వివాహితపై ముగ్గురు ఆటో డ్రైవర్లు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. వివాహితతో పాటు ఉన్న ఆమె స్నేహితుడిని కొట్టి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తరవాత జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివరాల ప్రకారం ఏలూరులోని ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తున్న 22 ఏళ్ల వివాహిత తన సోదరి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంది. అనంతరం అర్ధరాత్రి సమయంలో ఏలూరు తూర్పువీధికి చెందిన తన స్నేహితుడితో కలిసి బైక్‌పై ఇంటికి పయనమైంది. అయితే తిరుగు ప్రయాణంలో వీరిద్దరూ వట్లూరు హౌసింగ్ బోర్డు చివర నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఏకాంతంగా ఉన్న వీరిని గుర్తించిన వట్లూరుకు చెందిన ముగ్గురు ఆటో డ్రైవర్లు నవీన్ కుమార్, అనిల్ కుమార్, దుర్గారావు అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారంటూ వారిని ఆటో డ్రైవర్లు బెదిరించారు. వివాహిత స్నేహితుడిపై దాడి చేయగా అతను పరారయ్యాడు. ఆ తర్వాత వివాహిత పారిపోకుండా అనిల్ కుమార్, దుర్గారావు గట్టిగా పట్టుకున్నారు. ఆమెపై వన్నెకూటి నవీన్ కుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వారు వదిలిపెట్టడంతో ఇంటికి చేరుకున్న బాధితురాలు తల్లితండ్రులకు విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది.