గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’-యాక్షన్ చాలా తక్కువ, డ్రామా ఎక్కువ..!

Gangs of Godavari'- Action is very less, drama is more..!
Gangs of Godavari'- Action is very less, drama is more..!

విడుదల తేదీ : మే 31, 2024

తెలుగుబుల్లెట్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు

దర్శకుడు: కృష్ణ చైతన్య

నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య

సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రఫీ: అనిత్ మధడి

ఎడిటింగ్: నవీన్ నూలి

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మంచి అంచనాల నడుమ నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చుడండి .

కథ:

కొవ్వూరు గ్రామంలో లంకల రత్నం(విశ్వక్ సేన్) జీవితంలో ఎదగాలని ఎమ్మెల్యే దొరసామి రాజు(గోపరాజు రమణ) బృందంలో చేరుతాడు. ఆ తరువాత అతడు నానాజీ(నాజర్) గ్రూపులో చేరి ఎమ్మెల్యే కూడా అవుతాడు. అయితే, అతడి ప్రవర్తన కారణంగా అతడికి శత్రువులు చాలా మంది ఏర్పడతారు. టైగర్ రత్నాకర్‌గా ఎదిగిన రత్నాకర్ ప్రతికూల పరిస్థితులని ఎలా ఎదుర్కొన్నాడు? బుజ్జి(నేహా శెట్టి) ఎవరు.. రత్నాకర్‌కి ఆమెతో ఎలాంటి సంబంధం ఉంటుంది..? ప్రత్యర్థుల ఎత్తుగడలని రత్నాకర్ ఎలా తిప్పికొట్టాడనే విషయాన్ని వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Gangs of Godavari'- Action is very less, drama is more..!
Gangs of Godavari’- Action is very less, drama is more..!

ప్లస్ పాయింట్స్:

లంకల రత్నాకర్‌గా విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ అందరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అతడు గోదావరి యాసలో చెప్పే డైలాగులు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతాయి. అధికారం రాకముందు, వచ్చిన తరువాత అతడి పాత్రలోని వైవిధ్యాన్ని విశ్వక్ చాలా బాగా చూపెట్టారు . అంజలి మరోసారి తన నటనతో అందరిని ఆకట్టుకుంటుంది. ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆడియెన్స్‌ని ఇంప్రెస్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు, యువన్ శంకర్ రాజా అందించిన స్కోర్ మూవీ ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. గోపరాజు రమణ, నాజర్, హైపర్ ఆదిలు తమ పాత్రలకి మంచి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్:

మూవీ లోని ఫస్ట్ హాఫ్ ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో సాగగా, సెకండాఫ్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగింది. ఫస్ట్ హాఫ్‌లోని ఆసక్తిని సెకండ్ హాఫ్‌లో కొనసాగించలేకపోయాడు . కృష్ణ చైతన్య డైరెక్షన్ బాగున్నా, స్క్రీన్ ప్లే పై మరింత శ్రద్ధ పెట్టాల్సింది. నేహా శెట్టి పాత్ర ఇంకాస్త బెటర్‌గా ఉంటె బాగుండేది . అంజలి పాత్ర నిడివి కూడా ఇంకాస్త పెంచి ఉంటే బాగుండేది. ఎమ్మెల్యే పాత్రలో గోపరాజు రమణ కాకుండా వేరొక నటుడైతే ఆ ఇంపాక్ట్ బలంగా ఉంది . నాజర్, సాయి కుమార్‌ల ట్యాలెంట్ కూడా వృధా అయ్యింది. కొన్ని సీన్స్ చాలా బలంగా ఉన్నప్పటికీ వాటిని ప్రెజెంట్ చేసిన తీరు వాటిపై ఆసక్తిని తగ్గిస్తాయి. దర్శకుడు ఎమోషనల్ సీక్వెన్స్‌లపై మరికాస్త ఫోకస్ చేయాల్సిందే .

సాంకేతిక వర్గం:

కృష్ణ చైతన్య డైరెక్షన్ మాత్రం ఓవరాల్‌గా బాగున్నా, సెకండాఫ్‌పై ఆయన మరింత దృష్టి పెట్టి ఉంటే మూవీ కథ మరింత ఆసక్తికరంగా ఉండేది. యువన్ శంకర్ రాజా సంగీతం మూవీ కు బలంగా నిలిచింది. అనిత్ మధడి సినిమాటోగ్రఫీ బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ ఫస్ట్ హాఫ్‌లో అదిరిపోయినా, సెకండాఫ్‌లో చాలా బెటర్‌గా ఉండాల్సింది. చిత్ర నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.

తీర్పు:

మొత్తంగా చూస్తే, గ్యాంగ్స్ ఆప్ గోదావరి ఒక రొటీన్ మాస్ యాక్షన్ సినిమా గా నిలుస్తుంది. విశ్వక్ సేన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఆకట్టుకునే అంజలి నటన ఈ మూవీ కు కలిసొచ్చే అంశాలు. అయితే, సెకండాఫ్ మూవీ పై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పాలి. స్క్రీన్‌ప్లే సరిగా లేకపోవడం, అనవసరమైన సన్నివేశాలు, కథ చాలా స్లోగా సాగడం ప్రేక్షకులకి నిరాశను మిగిలిస్తాయి. ఈ వీకెండ్‌లో చక్కటి వినోదాత్మకమైన మూవీ చూడాలనుకునేవారు ఈసినిమా ని స్కిప్ చేయవచ్చు.