విశ్వక్ సేన్ నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మంచి అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాతో పాటు ఇంకో 2 సినిమాలు పోటీ పడ్డాయి. అయితే ఈ మూడు సినిమాల కంటెంట్ భిన్నంగా ఉండటంతో, వసూళ్లు కూడా అదే విధంగా ఉన్నాయి. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కు మాస్ ఆడియెన్స్ క్యూ కడుతుండటంతో ఈ చిత్రం వసూళ్లు బాగున్నాయి.
తొలి మూడు రోజులు ముగిసిన తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రానికి డీసెంట్ వసూళ్లు వచ్చినట్లు బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.16.2 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.షేర్ వసూళ్ల విషయానికి వస్తే, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లో రూ.6.62 కోట్ల వసూళ్లు సాధించింది. అంజలి, నేహా శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను కృష్ణ చైతన్య డైరెక్ట్ చేయగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్యలు ప్రొడ్యూస్ చేశారు.
ఈ చిత్రం షేర్ వసూళ్ల వివరాలు ప్రాంతాల వారీగా ఈ విధంగా ఉన్నాయి:
– నైజాం – రూ.2.48 కోట్లు
– సీడెడ్ – రూ.1.29 కోట్లు
– వైజాగ్ – రూ.0.77 కోట్లు
– నెల్లూరు – రూ.0.28 కోట్లు
– కృష్ణా – రూ.0.39 కోట్లు
– గుంటూరు – రూ.0.48 కోట్లు
– ఈస్ట్ – రూ.0.52 కోట్లు
– వెస్ట్ – రూ.0.41 కోట్లు
టోటల్ ఏపీ + తెలంగాణ – రూ.6.62 కోట్లు