నంద్యాల షాక్.. ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్… ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో గ్యాస్‌ లీకేజీ ఘటన మరవకముందే కర్నూలు జిల్లాలో ఇటువంటిదే మరో దుర్ఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లో అమోనియా గ్యాస్ లీకై ఒకరు మృత్యువాత పడ్డారు.

అయితే మరణించిన వ్యక్తి  ఆ కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాస రెడ్డిగా గుర్తించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే.. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి అంబులెన్స్‌తో పాటు ఫైర్‌ సిబ్బంది చేరుకున్నారు. ఫ్యాక్టరీ లోపల ఉన్న వారిని బయటకు తీసుకు వస్తున్నారు. కాగా ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్‌తో పాటు ఎస్పీ ఫక్కీరప్ప, జేసీ పరిశీలించారు. ఆ తర్వాత కలెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ.. అస్వస్థతకు గురైన ముగ్గురి పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని తెలిపారు. గ్యాస్‌ లీకేజీతో  స్థానికుల్లో భయాందోళన నెలకొంది.